వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం తదుపరి విచారణ నవంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌తో పాటు మరో నిందితుడు శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్‌పై కూడా విచారణ జరపాలంటూ వివేకా కుమార్తె డాక్టర్ సునీత పిటీషన్ వేశారు. దీనినిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. మరోవైపు వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని శివశంకర్ రెడ్డి కుమారుడు బెదిరించాడని, దానిపైనా విచారణ జరపాలని ఈరోజు సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అవినాష్, శివశంకర్ రెడ్డి, అతని కుమారుని కేసు...ఈ మూడింటిని ఒకేసారి వినాలని ధర్మాసనానికి విజ్ణప్తి చేశారు. మూడు కేసులను ఒకేసారి వినడానికి ధర్మాసనం అంగీకరిస్తూ.. తదుపరి విచారణను నవంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది.