ఉన్నత చదువులు చదివిన కాదంబరి ముందుగా ఏపీ మహిళా కమిషన్‌ను ఎందుకు ఆశ్రయించలేదని బాధితురాలిపైనే ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి ప్రశ్నలు సంధించడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. "మహిళకు అన్యాయం జరిగితే మాకు సంబంధం లేదని అంటావా. ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ పదవికి నువ్వు మాయని మచ్చ. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఎన్నికలకు ముందు నీకు పదవి వరించింది.
వైసీపీ నాయకుల తప్పులు మీకు కనిపించడం లేదా?. ఇతర రాష్ట్ర మహిళలకు మన రాష్ట్రంలో అన్యాయం జరిగితే మహిళా కమిషన్‌కు సంబంధం లేదని అంటారా?. నీ పదవీ కాలం ఇంకో సంవత్సరం ఉంది. ఈ యేడాది పాటు వైసీపీ నాయకులు మహిళలను వేధిస్తే ఇలానే ఏదో ఒక వంక పెట్టుకుని వారిని రక్షిస్తావు. ఇలాంటి క్రిమినల్స్‌ను వెనకేసుకు రావడం వైసీపీలో సంప్రదాయంగా మారింది. మేము ట్యాక్సులు కట్టిన డబ్బుతో నీకు ప్రభుత్వం లక్షలు లక్షలు జీతం ఇవ్వడం లేదా?. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని అసభ్య పదజాలంతో తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తావు. మా నుంచి రియాక్షన్ వస్తే టీడీపీ సోషల్ మీడియాపై కేసులు పెడతావు. మళ్లీ మీ పార్టీ 2029లో గెలిస్తే ఇలాంటి నేరస్థులనే ఇంకా పెంచి పోషిస్తుంది" అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.