మరికొన్ని రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం కాబోతుందంటూ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగుళూరు కేంద్రంగా కాంగ్రెస్ పార్టీతో వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన ఆరోపించారు. త్వరలో తల్లి కాంగ్రెస్లోకి పిల్ల కాంగ్రెస్ కలుస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది తెలిసే కొంత మంది ఆ పార్టీ నేతలు ఎవరిదారి వారు చూసుకుంటున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వ 100రోజుల పాలన అద్భుతంగా ఉందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కితాబు ఇచ్చారు. 100 రోజుల పాలన చూసి వైసీపీలో భయం మొదలైందని, చంద్రబాబు-పవన్ జోడీ సూపర్ సక్సెస్ అని కొనియాడారు.