ఏపీలో గొర్రెలు, మేకలు, కోళ్లు, పందుల పెంపకం యూనిట్లు ఏర్పాటు చేసుకునేవారికి 50% రాయితీ కల్పిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కనిష్ఠంగా రూ. 20 లక్షల నుంచి రూ. కోటి ఖర్చుతో యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. జాతీయలైవ్ స్టాక్ మిషన్ కింద యూనిట్ వ్యయంలో 50% రాయితీ వస్తుందని 40 శాతం బ్యాంకు రుణం, రైతు 10% వాటా చెల్లించాల్సి ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.