ఉక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో రష్యాపై దాడులను ఉక్రెయిన్ తీవ్రతరం చేసింది. రష్యాపై దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌కు పలు దేశాలు సాయం అందిస్తున్నాయి.ఈ నేపథ్యంలో నాటో దేశాలను పుతిన్ తీవ్రంగా హెచ్చరించారు. పశ్చిమ దేశాలపై అణ్వాయుధాలతో దాడి చేసేందుకు రెడీ అయినట్టు హింట్ ఇచ్చాడు.అమెరికా, యూకే సాయంతో ఉక్రెయిన్.. రష్యాపై భీకర దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే రష్యాపై బాంబు దాడికి ఉపయోగించే 'స్టార్మ్ షాడో' క్రూయిజ్ క్షిపణిని గత వారం యూకే క్లియర్ చేసింది. యూకే పీఎం కైర్ స్టార్మర్.. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను కలవడానికి వాషింగ్టన్ కూడా వెళ్లారు. రష్యా గడ్డపై ఉక్రెయిన్ ఆయుధాల వినియోగంపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. ఈ మేరకు రష్యా ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది. దీంతో, అప్రమత్తమైన రష్యా.. పశ్చిమ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు.
తాజాగా రష్యా భద్రతా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. తమ దేశంపై అణు సామర్థ్యం లేని రాజ్యం, అణు సామర్థ్యం కలిగిన దేశం మద్దతుతో మా దేశంపై దాడి చేసినప్పుడు రష్యా ఫెడరేషన్‌పై సంయుక్త దాడిగా పరిగణిస్తామని పుతిన్ తెలిపారు. ఈ క్రమంలో తాము అణు దాడులు చేసేందుకు వెనుకాడబోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.