వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.
విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా గుడివాడ అమర్నాథ్
అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా బూడి ముత్యాల నాయుడు
అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు
బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మేరుగు నాగార్జున
బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా నందిగం సురేష్
పార్టీ పీఏసీ మెంబర్గా ఆదిమూలపు సురేష్
విశాఖపట్నం (వెస్ట్) అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మళ్ళా విజయప్రసాద్
పార్టీ పీఏసీ మెంబర్గా, రాష్ట్ర ఎస్టీ విభాగం అధ్యక్షురాలిగా కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి నియమితులయ్యారు.