పోలీసు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఎస్పీ హర్షవర్ధనరాజు తెలిపారు. గురువారం సాయంత్రం కడప స్థానిక ఉమేశచంద్ర కల్యాణ మండపంలో మూడు రోజులుగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ సహకారంతో ఏర్పాటు చేసిన రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ ఉచిత స్ర్కీనింగ్ పరీక్షల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళా పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల్లోని మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు.విధుల్లో నిమగ్నమై సకాలంలో వైద్యపరీక్షలు చేయించుకోలేని సిబ్బంది మెడికల్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మున్ముందు మరిన్ని మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. క్యాంపు ఏర్పాటుకు సహకరించి మణిపాల్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడికి, రేడియేషనల్ ఆంకాలజిస్ట్ స్పెషలిస్ట్ వైద్యులు డాక్టర్ దివ్య, రామ్‌చక్రవర్తి, సిబ్బందిని అభినందించారు. అలాగే ఏఆర్ అదనపు ఎస్పీ ఎస్‌ఎ్‌సవీ క్రిష్ణారావు, అదనపు ఎస్పీ (అడ్మిన) కె.ప్రకాశబాబు, పోలీసు సంక్షేమ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ మేరిసుజాత, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేశ, ఉపాధ్యక్షుడు ఉప్పుశంకర్, మహిళా ఎస్‌ఐలు పావని, నస్రిన, మహిళా కానిస్టేబుళ్లు లక్ష్మిదేవి, మాధవీలత, క్రిష్ణవేణిలలలను కూడా ఎస్పీ అభినందించారు.