అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా నాణ్యమైన పొగాకు ఉత్పత్తి చేయాలని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్‌కుమార్ అన్నారు. దేవరపల్లిలో గురువారం పొగాకు వేలం కేంద్రంలో ఆయన రైతులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది పొగాకు ధరలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. ఆమోదయోగ్యంగా లేని చౌడు, బడ్వాల్లోనూ పొగాకు పంట వేయవద్దని హెచ్చరించారు. అనంతరం దేవరపల్లి శివారు పల్లంట్ల రోడ్డులో పొగాకు నారుమడులను పరిశీలించారు. నారుమడులకు తెగుళ్లు సోకకుండా జాగ్రత్తలు, సూచనలు చేయాలని బోర్డు అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ జీఎల్‌కే ప్రసాద్, వేలం నిర్వహణాధికారి పీ.హేమస్మిత, రైతు సంఘం నాయకులు కరుటూరి వెంకట శ్రీనివాస్, ఆచంట గోపాలకృష్ణ, కాట్రు సత్యనారాయణ, మాజీ సొసైటీ అధ్యక్షులు కరుటూరి శ్రీనివాస్, రైతులు సింహాద్రి ధర్మవతారం, యాగంటి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.