దివ్యాంగులు, కుష్టువ్యాధి గ్రస్థులు సామాజికంగా ఆర్థికంగా అన్నిరంగాల్లో రాణించాలని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ ఏడీ జీవీబీ జగదీష్ అన్నారు. గురువారం విజయనగరం రింగురోడ్డు లెప్రసీ మిసన్ 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా హీల్ ప్రోజ క్టు ఆధ్వర్యంలో లెప్రసీ వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులతో చాంపియన్ వర్కషాపు నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏడీ జగదీష్ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు. హీల్ ప్రోజ క్టుమేనేజర్ కిస్మత్ నందా మాట్లాడుతూ కృష్టు వ్యాధిగ్రస్థులకు తోడ్పాటును అందించాలనే ఉద్దేశంతోనే లెప్రసీ మిషన్ స్థాపిం చారన్నారు. ప్రాజక్టు కో-ఆర్డి నేటర్ తాలాడ దీప్తి, జిల్లా డీఎంఎన్‌వో అధికారిని డాక్టర్ అర్చన, హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు అచ్చిరెడ్డి, హెల్పింగ్ హ్యాండ్స్ సంఘ అధ్యక్షుడు కొంపల్లి తదితరులు పాల్గొన్నారు.