సారవకోట మండలంలోని జలుమూరు గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ అనిల్‌కుమార్ తెలిపారు. ఆ బాలిక 9వ తరగతి చదువుతుంది. బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడినట్టు బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొందన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.