శ్రీకాకుళం నగరంలోని ఏపీహెచ్‌బీ కాలనీలో ఉన్న ఎంఐజీ-51 నెంబరు గల ఇంట్లో బుధవారం రాత్రి దొంగలు పడ్డారు. తలుపులు పగలు గొట్టి ఇంట్లోకి వెళ్లిన దొంగలకు ఆ ఇంట్లో కనీసం కుర్చీలు కూడా లేకపోవడం చూసి ఖాళీ చేతులతో వెళ్లిపోయారు. ఆ ఇంట్లో నివసిస్తున్న నిర్మల అనే మహిళ సత్యసాయి డివోటీ, ఆమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారు ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండడంతో ఇంట్లో ఎటువంటి సామగ్రి ఉంచలేదు. కాగా ఘటనా స్థలాన్ని వన్‌టౌన్ పోలీసులు, క్లూస్ టీం పరిశీలించి, ఎటువంటి నష్టం జరగలేదని గుర్తించారు. దీనిపై బాధితురాలు కూడా ఫిర్యాదు చేయలేదు.