భోగాపురం ఎయిర్ పోర్టు ఆరునెలలు ముందుగానే పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు తెలిపారు. జిల్లాలో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు, స్థల పరిశీలన కూడా జరుగు తుందన్నారు. గురువారం వజ్రపుకొత్తూరు మంచినీళ్లపేటలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ.. మూలపేట పోర్టును పూర్తి చేసి జిల్లాలో ఉద్యోగావకాశాలు కల్పించేందకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా వెనుకబడిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, పలాస ఆర్డీవో భరత్నాయక్, మండల ప్రత్యేకాధికారి ఎం.రవికృష్ణ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.