గత ఐదేళ్ల వైసీపీ పాలనతో సంక్షోభంలో ఉన్న రాష్ట్రం నేడు కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం, అభివృద్ధి దిశగా పయనిస్తోందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. గురువారం నందికొట్కూరు పట్టణంలోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్‌లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ బేబి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్‌రెడ్డి, వైస్ చైర్మన్ రబ్బాని, టీడీపీ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్‌రెడ్డి, కౌన్సిలర్లు నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి ఐదేళ్ల కాలంలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయలేదన్నారు. వైసీపీ హయాంలో అన్న క్యాంటీన్లను జగన్ నిలుపుదల చేశారన్నారు.
అయితే నేడు కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించి పేదల కడుపు నింపుతోందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసి రైతులలో నెలకొన్న భయాందోళనలను చంద్రబాబు తొలగించారన్నారు. మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను ఇస్తామన్న హామీని దీపావళి నుంచి అమలు చేస్తారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారన్నారు. ఐసీడీఎస్ ఏపీడీ కోటేశ్వరమ్మ, బీజేపీ నాయకుడు దామోదర్‌రెడ్డి, జనసేన నాయకుడు నల్లమల రవికుమార్, కౌన్సిలర్లు జాకీర్ హుస్సేన్, భాస్కర్‌రెడ్డి, మందడి వాణి, సుమలత, చాంద్‌బాష, లాలు ప్రసాద్, టీడీపీ నాయకులు ముర్తుజావళి, వేణుగోపాల్, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.