కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హర్యానాలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ‘జైలులో నన్ను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టేందుకు ప్రయత్నించారు.
నేను షుగర్ పేషేంట్‌ను. నాకు రోజుకు నాలుగు ఇన్సులిన్ ఇంజెలిక్షన్లు అవసరం. జైలులో నాకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు అందకుండా చేశారు. వారికి తెలియని విషయం ఏంటంటే. వాళ్లు నన్ను ఏమీ చేయలేరు. ఎందుకంటే నేను హర్యానా బిడ్డను’ అని పేర్కొన్నారు.