పండుగలకు చేనేత వస్త్రాలనే ధరిద్దామని..నేతన్నలను ఆదరిద్దామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. నారా భువనేశ్వరి పిలుపు మేరకు చేనేతలకు అండగా నిలబడదామని పిలుపునిచ్చారు. పండుగలకు చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలను ఆదరించాలని హోంమంత్రి వంగలపూడి అనిత కోరారు. ఏపీ సచివాలయంలో హోంమంత్రి అనిత ఇవాళ(ఆదివారం) మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపు మేరకు తెలుగు ప్రజలు చేనేతలకు అండగా నిలవాలని హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. ఒంట్లో నరాలను దారాలుగా పోగు చేసి కష్టపడి..రక్తంతో రంగులు అద్దుతూ చెమటోడ్చే చేనేతల బతుకు చిత్రం మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాబోయే రోజుల్లో వరుస పండుగల నేపథ్యంలో మన సంస్కృతి, సంప్రదాయాలను చాటే వస్త్రాలను ధరించడంతో పాటు చేనేతల కళారూపాలకు పెద్దపీట వేయాలని కోరారు. ‘మన కుటుంబంతో పాటు మన ఇంట్లో ఆనందంగా పండుగ చేసుకోవడంతో పాటు చేనేత వస్త్రాలపై ఆధారపడి బతికే అందరి ఇళ్లల్లో పండుగ సంతోషం నింపాలి’ అని హోంమంత్రి వంగలపూడి అనిత కోరారు.