తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ఆధారాల్లేకుండా.. దర్యాప్తు అడుగు పడకుండానే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందు నుంచి చెబుతున్న విషయాల్నే.. ఇవాళ సుప్రీం కోర్టు ప్రముఖంగా ప్రస్తావించించడం గమనార్హం.తిరుమల లడ్డూ వివాదంపై జగన్ మొదటి నుంచి ఏం చెబుతూ వస్తున్నారో.. దాదాపు అలాంటి వ్యాఖ్యలే ఇవాళ సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం చేసింది. వాటి మధ్య ఉన్న సారూప్యతలను పరిశీలిస్తే..‘జులై 12న నమూనాలు తీసుకున్నారు. వాటిని పరీక్షిస్తే సరిగా తేలలేదని, జులై 17న ఎన్‌డీడీబీకి వాటిని పంపారు. వాటిపై ఆ సంస్థ జులై 23న నివేదిక ఇచ్చింది. కానీ 2 నెలల తర్వాత.. ఇప్పుడు బయటకు తీసి టీడీపీ కార్యాలయంలో విడుదల చేశారు’. అంటే ఇదంతా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన సంఘటనలే. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ఎన్‌డీడీబీ నివేదికను సీఎం నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన సమయాన్ని తప్పుబట్టింది. జులైలో రిపోర్ట్ వచ్చింది. తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో చేపనూనె, జంతువుల కొవ్వు, పందికొవ్వు ఉన్నట్లు గుజరాత్ ల్యాబ్ రిపోర్టు పేర్కొంది. జులైలో నివేదిక వస్తే.. దానిని సెప్టెంబర్‌లో చెప్పారు.. ఎందుకు?. ఈ నివేదికపై చంద్రబాబు మీడియాను ఆశ్రయించాల్సిన అవసరం ఏమొచ్చింది? అని ప్రశ్నించింది. రాజకీయాల కోసం భగవంతుడిని లాగకండి అని హెచ్చరించింది.