తిరుమల లడ్డూ వ్యవహారంపై నేడు సుప్రీం కోర్ట్ లో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ల్యాబ్ మీ వద్ద ఆధారాలు ఉన్నాయా? నెయ్యిని రిజెక్ట్ చేశారని ఈవో చెప్పారు కదా?.ఇదంతా పబ్లిక్ డొమైన్‌లో ఉంది కదా? అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు. మీరు మీడియాకు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా. జులైలో రిపోర్ట్ వస్తే.. సెప్టెంబర్‌లో చెప్పారెందుకు? సిట్ ఎందుకు వేశారు? అంటూ సీఎం చంద్రబాబు బాబు వైఖరిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోట్లాది భక్తుల మనోభావాలను గాయపరిచారు. నెయ్యి రిజెక్ట్ చేశాక వాడే పరిస్థితి ఉండదు కదా? ధర్మాసనం ప్రశ్నించింది.