ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలందరికీ ఉచిత వైద్యం అందించడం సంతోషకరమని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవో డాక్టర్ లక్ష్మీషా అన్నారు. ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కార్యక్రమం ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం ఉదయం మంగళగిరిలోని ట్రస్ట్ కార్యాలయ నుంచి ఇంటింటికి ఆరోగ్యం, ఇంటింటికి ఆయుష్మాన్ భారత్ పేరుతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంగళగిరి చేనేత జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌పై ఆస్పత్రులతో వర్క్‌షాపు నిర్వహించారు. ప్రతి వైద్యుడికి సంబంధించి రిపోర్టులు, మెడికల్ రికార్డు డిజిటలైజ్ కావాలని అన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. రోగుల అత్యవసర సమయంలో ఈ డిజిటల్ రికార్డులు ఉపయోగపడతాయని సూచించారు. అనంతరం త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఆరోగ్య బీమాపై నెట్‌వర్క్ ఆస్పత్రులతో ఆయన సమావేశం నిర్వహించారు. బీమా ఏలా అమలు చేయాలన్న దానిపై ఆస్పత్రుల యాజమాన్యాల దగ్గర నుంచి ఆయన సలహాలు, సూచనలు తీసుకున్నారు. సమావేశంలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అడ్మిన్ ఈవో వెంకట దీపక్, ఈవో డాక్టర్ నవీన్ పాల్గొన్నారు.