కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు, బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో కో-ఆర్డినేటర్ రాఘవేంద్ర చౌదరి ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాల రైతులకు ఉచితంగా పొద్దు తిరుగుడు విత్తనాలు, డ్రమ్ము, తార్పల్, గడ్డపారను సోమవారం పంపిణీ చేశారు. ఎమ్మిగనూరు ప్రాంతంలో పొద్దుతిరుగుడు సాగు తక్కువగా ఉందన్నారు. రైతులు ఈ విత్తనాలు సాగు చేసి, మంచి దిగుబడి సాధించి లాభాలు పొందాలని ఉచితంగా అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. పూత దశలో బొరాక్స్‌ను పిచికారీ చేసుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు డాక్టర్ రాధాకుమారి, వెంకటరమణమ్మ, రవిప్రకాష్‌రెడ్డి, కేవీకే శాస్త్రవేత్తలు చందన, మౌనిక, నిరంజన్, రైతులు పాల్గొన్నారు.