ఆలూరు నియోజకవర్గ సమస్యలను సీఎం చంద్రబాబు పరిష్కరించాలని ఎమ్మెల్యే విరుపాక్షి డిమాండ్ చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ పత్తికొండ డివిజన్ పర్యటనకు మంగళవారం వస్తున్న సీఎం చంద్రబాబు వేదవతి, నగరడోణ ప్రాజెక్టులు పూర్తి చేసి హంద్రీనీవా కాలువకు తూము ఏర్పాటుకు ననిఉలు విడుదల చేయాలని కోరారు. తాగునీటి సమస్యను పరిష్కరించి ఆధ్వాన స్థితికి చేరిన రహదారులు బాగు చేయాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు గడచినా పింఛన్లు ఇచ్చి నేను తప్ప ఎవరు ఇవ్వడం లేదు అనట్లు పొటోలకు ఫోజులివ్వడం తప్ప ఒరిగిందేమిలేదని ఆరోపించారు.
వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు. పత్తికొండ రెవిన్యూ డివిజన్‌లో టమోటా రైతులను ఆదుకునేందుకు గిటుబాటు ధర కల్పించాలన్నారు. అస్పరిలో టమోటా జ్యూస్ ప్యాక్టరీ ఏర్పాటుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. వైసీపీ నాయకులు మారయ్య, చిన్న ఈరన్న, వెంకటేశ్వరులు, వీరేశ్, నాగేంద్ర పాల్గొన్నారు.