అనంతపురం జిల్లా, కూడేరు మండలంలోని నారాయణపురంలో సోమవారం సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ పార్టీ నాయకులతో కలిసి పల్లెనిద్ర చేపట్టారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఖరీ్‌ఫలో సాగు చేసిన కంది, ఆముదం పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, పెట్టుబడి కూడా వచ్చేలా లేదని పలువురు రైతులు వాపోయారు.
స్పందించిన జాఫర్ మాట్లాడుతూ.. రైతులకు వెంటనే రైతు భరోసా ద్వారా అందించాల్సిన మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. మైక్రో ఇరిగేషన పనులు త్వరితగతిన పూర్తి చేసి రైతులను ఆదుకోవాలన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇ చ్చిన సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలన్నా రు. సీపీఐ తాలుకా కార్యదర్శి మల్లికార్జున, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పార్వతి, ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి ఆకులేటి మల్లికార్జున రైతు సంఘం నాయకులు, వ్యవసాయకార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.