ఆసుపత్రిలో రాత్రి వేళ పనిచేసే వైద్యుల రక్షణకు ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ అన్నారు. ధర్మాజిగూడెం పీహెచ్‌సీలో అర్ధరాత్రి తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలో సీసీ కెమెరాలు, చుట్టూ లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆసు పత్రిలో చికిత్సపొందుతున్న రోగులను వైద్య సేవలపై ఆరా తీశారు.
వారికి వైద్యఖర్చుల నిమిత్తం కొంత నగదు అందజేశారు. ఆయనతో పాటు గారపాటి నాగబుద్ధవరప్రసాద్, కూటమి నాయకులు పాల్గొన్నారు. అలానే శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అన్నారు. జలపావారి గూడెం రహదారి విషయమై సోమవారం ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. బాధితులు తడికలపూడి పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలుసు కున్న ఎమ్మెల్యే రోషన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఎస్‌ఐ చిన్నారావుతో చర్చించి నిందితులపై కేసు నమోదు చేయాలన్నారు.