పెరవలి రైస్‌మిల్లులో జరిగిన దొంగతనానికి సంబంధించిన కేసును పోలీసులు ఛేదించడంతోపాటు నగదును రికవరీ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిడదవోలు సీఐ వి.శ్రీనివాస్, పెరవలి ఎస్‌ఐ అప్పారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జాతీయ రహదారిపైనున్న ఎస్‌ఆర్‌కె రైస్‌మిల్లు లో సెప్టెంబర్ నెల 15న మధ్యాహ్న సమయంలో దొంగలు ప్రవేశించి బీరువాలో గల 12 లక్షల 40 వేలు అపహరిం చారు.
రైస్‌మిల్లు యజమాని బాలాజీ 16న ఫిర్యాదు చేయగా అనుమానితుడిపై నిఘా పెట్టి దర్యాప్తు చేశారు. అదే రైస్‌మిల్లులో గుమాస్తాగా పనిచేస్తున్న తణుకుకు చెందిన కామేశ్వరరావు ఈ చోరీకి పథకం రచించినట్లు తెలిపారు. గతంలో పరిచయస్తులైన తణుకు అజ్జరం కాలనీకి చెందిన కరుణకుమార్, వారాధి రాజు, సూరి పెంటయ్య, నాగరాజు, ఏసులకు బీరువాలో నగదు ఉన్నట్లు సమాచారం అందించాడు. దీంతో ఆ రోజు మధ్యాహ్న సమయంలో అందరూ భోజనాలకు వెళ్ళగా బీరువాను బద్దలుకొట్టి సొమ్ము అపహరించారు. తాము జరిపిన విచారణలో అజ్జరం కాలనీ వద్ద వారు నగదు పంచుకుం టుండటంతో అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టగా వారికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు.