విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర అని శాసనమండలి విపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అందులో భాగంగనే స్టీల్ ప్లాంట్‌లో 3,725 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తూ, వారికిచ్చిన కార్డులను రద్దు చేస్తున్నారని ఆక్షేపించిన ఆయన, ఒక్క కార్మికుణ్ని తొలగించినా ఊర్కోబోమని హెచ్చరించారు.
కార్మికుల ఉద్యోగాలు పరిరక్షించాలని కేంద్రాన్ని డిమాండ్ చేసిన ఆయన, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒత్తిడి చేయాలని కోరారు. స్టీల్ ప్లాంట్‌లో పరిణామాలు చూస్తుంటే.. ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించి ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు సీఎం, డిప్యూటీ సీఎం కట్టుబడి ఉండాలని బొత్స అన్నారు.