పరిశుభ్రత సామాజికబాధ్యత అని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. బుధవారం పార్వతీపురంలోని ఎస్‌ఎన్‌ఎంనగర్ పార్క్‌లో స్వచ్ఛత దివాస్ కార్యక్రమం నిర్వహించారు. తొలుత గాంధీ చిత్రపటానికి, ఎమ్మెల్యే బోనెల విజయచంద్రతోపాటు పూలమాలవేసి నివాళులర్పించారు.ఈసందర్భంగా స్వచ్ఛభారత్‌లో అందరం భాగస్వాములవుతాని, కలెక్టర్‌తో ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, మున్సిపల్ కమిషనర్ కె. శ్రీనివాసరావు, తదితరులు ప్రమాణం చేశారు. అనంతరం స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమం ముగింపులో భాగంగా ఎస్‌ఎన్‌ఎంనగర్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అలాగే పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ఆలోచనలు బాగుంటాయని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు.బుధవారం పార్వ తీపురం శివారులోగల జట్టు ఆశ్రమంలో స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛసుందర పార్వతీపురమే లక్ష్యంగా పనిచేస్తున్న జట్టు ఆశ్రమ నిర్వాహికులు పద్మజకు అభినందించారు. అనంతరం జట్టు ఆశ్రమ విద్యార్థినుల శాస్త్రీయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో నాబార్డు డీడీఎం దిలీప్ పాల్గొన్నారు.