తిరుమలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ(శుక్రవారం) రానున్నారు. తిరుమలకు చేరుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికీ సీఎం చంద్రబాబునాయుడు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 7గంటలకు తిరుమలకు చంద్రబాబు చేరుకోనున్నారు. రాత్రి 8గంటలకు తన సతీమణి భువనేశ్వరితో కలిసి శ్రీవారికీ పట్టవస్త్రాలను చంద్రబాబు సమర్పించనున్నారు. దర్శనాంతరం 2025 డైరీ, క్యాలెండర్లను చంద్రబాబు ఆవిష్కరించునున్నారు.
రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీదేవి,భూదేవి సమేత మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ ఉత్సవంలో చంద్రబాబు దంపతులు పాల్గొననున్నారు. సీఎం చంద్రబాబు తిరుమల వస్తుండటంతో పోలీసులు భారీ భధ్రత ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. భక్తులు భారీగా తరలి వస్తుండటంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.