తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమైనాయి. శనివారం ఉదయం తిరుమల శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అందుకోసం శుక్రవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమలకు బయలుదేరారు.
అయితే ఈ విమానం అనుకున్న సమయాని కంటే.. దాదాపు 30 నిమిషాలు ముందే బయలుదేరింది. దీంతో సీఎం చంద్రబాబు రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రేణుగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుమలకు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. రాత్రికి తిరుమలలోనే చంద్రబాబు బస చేయనున్నారు. ఇక శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం పెద్ద శేష వాహనంలో స్వామి వారి ఉత్సవంలో సీఎం పాల్గొనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు అమరావతికి తిరిగి పయనమవ్వనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసలు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.