విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక, ప్రజా, విద్యార్థి, రైతు సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిరసన దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరాన్ని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ యిళ్ల వెంకటేశ్వరరావు సందర్శించి మాట్లాడారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించి ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
దీక్షా శిబిరాన్ని ఏఐటీయూసీ ఉమ్మడి జిల్లా పూర్వపు అధ్యక్షుడు కొప్పుల సత్తిబాబు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల బలరామ్, వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు, ఐఎన్‌టీయూసీ నాయకురాలు అయితాబత్తుల సుభాషిణి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వాసంశెట్టి సత్తిరాజు సందర్శించి మాట్లాడారు. శిబిరంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గుదే దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షుడు భాస్కరరావు, వివిధ సంఘాల నాయకులు పీతల రామచంద్రరావు, తాడి శ్రీరామమూర్తి, పొలమూరి శ్రీనివాసరావు, జి.దైవకృప, టి.నాగవరలక్ష్మి, అమీదా, బి.వెంకటలక్ష్మి, కుడుపూడి వెంకటలక్ష్మి, కె.శంకర్, జి.శశి, జె.సంతోష్, జె.నవ్యశ్రీ, ఊడాల వెంకటేష్, నిమ్మకాయల శ్రీనివాసరావు, వి.దొరబాబు పాల్గొన్నారు.