సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకి చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. మొదటి నుంచి వైయస్ఆర్‌సీపీ నేతలు చెబుతున్న దానినే సుప్రీంకోర్టు ఏకీభవించినట్లు అనిపించిందన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ద్వారా నిజానిజాలు బయటికి రావు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు అయ్యే స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారానే నిజాలు బయటికి వస్తాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. రాజ్యాంగం, కోర్టుల గురించి పవన్‌కు అవగాహన లేదు. హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదు. వారాహి డిక్లరేషన్‌లో పవన్ చేసిన వ్యాఖ్యలను కోర్టు ధిక్కరణ కింద పరిగణలోకి తీసుకోవాలి.