స్విగ్గీకి బిగ్ షాక్ ఇచ్చారు హోటల్స్ యజమానులు. స్విగ్గీని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి స్విగ్గీకి అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. మరి స్విగ్గీపై హోటల్స్ యాజమాన్యం ఎందుకంత కోపంగా ఉంది.. ఎందుకు ఇంతటి కీలక నిర్ణయం తీసుకుంది.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్విగ్గీని బాయ్ కాట్ చేస్తున్న హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బందులు పెడుతోందని హోటల్, రెస్టారెంట్ల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. స్విగ్గీ విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్నట్లు హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్.వి స్వామి, కమిటీ కన్వీనర్ రమణారావు చెప్పారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని హోటల్స్, రెస్టారెంట్లలో స్విగ్గీకి అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.