ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ దుర్భుద్ధితో మత విశ్వాసాలను ఎలా రెచ్చగొట్టారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుందని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పొలిటికల్ డ్రామాలు చేయవద్దని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పిందని. అయినప్పటికీ టీడీపీ ఇప్పటికీ అసత్య ప్రచారమే చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరిగినా చంద్రబాబులో ఇప్పటికీ పశ్చాత్తాపం కనిపించడం లేదని వైయస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబుకు ప్రశ్ఛాత్తాపం ఉండదు. దేవుడంటే భయం, భక్తి ఉండదు. ఈ రోజు టీడీపీ ఆఫీసియల్ ట్విట్టర్‌లో చంద్రబాబు పోస్టు చూస్తే ఆయన నైజం ఏంటో తెలుస్తుంది. ఇప్పటికీ కూడా అబద్ధాలు, దుర్భుద్ది చూస్తే ఈ పోస్టు వివరిస్తుంది. అబద్ధం మీద అబద్ధం చెబుతున్నాడు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపినందుకు సుప్రీం కోర్టు సీరియస్ కావడంతో బావ ధర్మారెడ్డి, మామ కరుణాకర్‌రెడ్డి అంటూ పోస్టు చేశారు. దారుణంగా వక్రీకరణలు చేస్తున్నారు.
సుప్రీం కోర్టు చంద్రబాబుకు అంక్షింతలు వేస్తే..నేషనల్ మీడియా మొత్తం చంద్రబాబును ఆక్షేపించింది. ప్రతి ఇంగ్లీష్ పేపర్ చంద్రబాబు లడ్డూ రాజకీయాన్ని ఎండగట్టాయి. చంద్రబాబును సుప్రీం కోర్టు ఆక్షేపిస్తున్నా కూడా..టీడీపీ ట్విట్టర్‌లో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ఎంత నీచానికి దిగారన్నది ఇదే నిదర్శనం. అందరూ చంద్రబాబును తిడుతుంటే ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా రివర్స్‌గా మాట్లాడుతున్నారు. వైవీ సుబ్బారెడ్డిపై సుప్రీం కోర్టు ఆగ్రహమంట. ఇంత దారుణంగా వక్రీకరిస్తున్నారు అని అన్నారు.