కర్నూలు నగరంలో క్షేత్రస్థాయిలో చిన్నపాటి సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దని నగర పాలక కమిషనర్ ఎస్.రవీంద్రబాబు అధికారులకు సూచించారు. శుక్రవారం ఆనంద్ థియేటర్, మద్దూర్‌నగర్, గౌసియా కాంప్లెక్స్, లక్ష్మీనగర్, డైమండ్ కాంప్లెక్స్, గ్రీనపార్కుల తదితర ప్రాంతాలలో అధికారులతో కలిసి విస్తుృతంగా పర్యటించారు. హందీ నది ఇంకా శుభ్రపరచాలని, మట్టి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. పలు ప్రాంతాలలో మురుగు కాల్వలపై ఆక్రమణలు వెంటనే తొలగించాలన్నారు. మురుగు కాలువల ప్రవాహానికి ఆటంకాలు ఉన్న చోట్ల అవసరమైన నిర్మాణాలు చేపట్టాలన్నారు. రెయిలింగ్ సక్రమంగా ఉండాలని, రహదారులపై నీటి నిల్వలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్పొరేటర్ రమణమ్మ, సిటీ ప్లానర్ ప్రదీప్‌కుమార్, ఆరోగ్య అధికారి కే.విశ్వేశ్వరరెడ్డి, ఎఈలు శేషసాయి, సత్యనారాయణ, డీఈ కృష్ణలత తదితరులు ఉన్నారు.