కడప జిల్లాలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కడప జిల్లా యర్రగుంట్ల మండల పరిధిలో గుత్తి గ్రామంలో శనివారం అర్ధరాత్రి టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ఈ ఘర్షణలో వెంకట రాముడు అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాత కక్షల వల్లే ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa