విజయవాడలో ఓ కామాంధుడు 13ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడు. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి స్థానికంగా ఉంటున్న ఓ బాలికపై కన్నేశాడు. చిన్నారి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి లైంగిక దాడికి యత్నించాడు. మద్యం పూటుగా తాగి బాలికపై అఘాయిత్యానికి ఒడికట్టాడు. అయితే చిన్నారి కేకలు విన్న స్థానికులు కామాంధుడిని పట్టుకున్నారు.
అనంతరం దసరా బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.