ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపుల కోసం జారీచేసిన లాటరీ వ్యవహారం కాక రేపుతోంది. లాటరీ విషయంలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటారని వస్తున్నా కథనాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. లిక్కర్ లాటరీ కోసం ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక్కో షాపు కోసం రూ.2 లక్షల డీడీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డబ్బులు నాన్ రీఫండబుల్.మీడియాలో వస్తున్న కథనాల గురించి సీఎం చంద్రబాబు అధికారులను ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకున్నారు. మద్యం షాపులో ఎవరి జోక్యం ఉండదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
లిక్కర్ షాపుల కోసం అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. కొందరు వ్యాపారులను కూటమి ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారని తెలుస్తోంది. మెయిన్ సెంటర్లలో అప్లై చేసుకునే వారిపై కూటమి ఎమ్మెల్యేలు ఫోకస్ చేశారు. లిక్కర్ షాపుల దరఖాస్తు కోసం 48 గంటల సమయం మాత్రమే ఉంది. దాంతో లిక్కర్ లాటరీకి సంబంధించి ఎవరి ప్రమేయం ఉండదని, ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.