డబ్బు కోసం అన్నాచెల్లెలు వివాహం చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకుంది. కొత్తగా పెండ్లి చేసుకున్న జంటకు యూపీ ప్రభుత్వం అందజేసే నగదు సాయాన్ని పొందేందుకు అక్రమ మార్గం తొక్కారు.
రూ.35 వేల కోసం వీరు వివాహం చేసుకున్నారు. స్థానికుల ఫిర్యాదుతో ఈ బాగోతం బయటపడింది. దీనిపై జిల్లా అధికారులు దర్యాప్తు చేపట్టారు. ‘ముఖ్యమంత్రి సామూహిక్ వివాహ యోజన’ పథకం అక్రమార్కులకు బంగారు బాతుగా మారిందని విమర్శలొస్తున్నాయి.