రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మకు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. విజయవాడ నుంచి వెళ్లిన న్యాయవాదుల బృందం ప్రయాణిస్తున్న బస్సు రాజస్థాన్ లో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటన గురించి భజన్ లాల్ తో చంద్రబాబు మాట్లాడారు. ప్రమాద బాధితులకు అవసరమైన సాయం అందించాలని కోరారు. వారంతా తిరిగి ఇంటికి రావడానికి సహాయ సహకారాలు అందించాలని విన్నవించారు. మరోవైపు, ఈ ప్రమాదంలో ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ భార్య జ్యోత్స్న మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.