దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శుక్రవారం మహిషాసురమర్దిని దేవీగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. లోక కంటకుడైన మహిషాసురుణ్ని చంపిన మహోగ్రరూపం ఇది. సకల దేవీ, దేవతల శక్తులన్నీ ఈ దేవీలో మూర్తీభవించి ఉంటాయి. మానవనేత్రంతో చూడ సాధ్యం కాని దివ్యతేజస్సుతో, అనేక ఆయుధాలతో సింహవాహినియై ఈ తల్లి భక్తులకు దర్శనభాగ్యం కలిగిస్తుంది. మహిషాసుర సంహారం జరిగిన రోజునే 'మహర్నవమి'గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa