కన్నుల పండువగా జరిగే ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అమ్మ వారి భక్తులు భారీగా విజయవాడ చేరుకునేవారు. అయితే కృష్ణా నదిలో నీటి ప్రవాహం కారణంగా ఈ ఏడాది అమ్మ వారి జలవిహారాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదీకాక ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద కారణంగా విజయవాడకు వరద నీరు పోటెత్తింది. దీంతో విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అందులోభాగంగా సహాయక చర్యలు చేపట్టింది. దీంతో కొద్ది రోజుల్లోనే విజయవాడకు వరద ముంపు నుంచి ఉపశమనం లభించినట్లు అయింది.ఈ వరద కారణంగా విజయవాడ నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పిలుపు మేరకు టాలీవుడ్ పరిశ్రమలోని పెద్దలతోపాటు ప్రజలు సైతం భారీగా కదిలి వచ్చారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా వరద నష్టంపై అంచనా వేసి నిధులను తక్షణ చర్యల్లో భాగంగా విడుదల చేసింది. ఇంకోవైపు విజయవాడలోని కృష్ణా నదిలో వరద ఉదృతి ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కృష్ణా నదిలో అమ్మవారికి హంస వాహన సేవను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.