నరసన్నపేట, పోలాకి మండలంలోని వనవిష్ణుపురంలో ఈనెల 8న జరిగిన టీడీపీ కార్యకర్త పాలిన వీరాస్వామి హత్యకేసులో మరో నలుగురు నిందితులను శుక్రవారం అరెస్టు చేసినట్టు సీఐ జె.శ్రీనివాసరావు తెలిపారు. తలగాన రాజు, నునెల తిరుపతిరావు, తలగాన లచ్చయ్య, తలగాన రమేష్‌ను అరెస్టు చేసినట్టు చెప్పారు. 12 మందిపై కేసు నమోదు చేయగా.. ఇప్పటి వరకు ఏడుగుర్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామని తెలిపారు.