త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ NCP (SP) అధ్యక్షుడు శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ మార్పుకు ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారని తెలిపారు.
దేశంలోనే అత్యుత్తమంగా చెప్పుకునే రాష్ట్ర పరిపాలన మహాయుతి ప్రభుత్వంలో నిరుత్సాహానికి గురైందన్నారు. వచ్చే ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.