విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భవానీ స్వాముల రద్దీ పెరిగింది. భవానీ మాల ధారణ చేపట్టిన స్వాములు ఇంద్రకీలాద్రికి పోటెత్తుతున్నారు. భవానీలు భారీ సంఖ్యలో వస్తుండడంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఏపీ దేవాదాయ శాఖ కమిసనర్ శ్రీరామ్ సత్యనారాయణ, కనకదుర్గ ఆలయ ఈవో స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. క్యూలైన్లలో మహిళలు, పిల్లలు, వృద్ధ స్వాములు కూడా ఉండడంతో వారికోసం పాలు, బిస్కెట్లు, మజ్జిగ అందిస్తున్నారు. ఎండ వేడిమిని దృష్టిలో ఉంచుకుని ఎక్కడిక్కడ తాగునీరు అందుబాటులో ఉంచారు. క్యూలైన్లకు దగ్గరగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.