రాష్ట్రంలో ఉన్న మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించే ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా 89 వేల 882 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు రుసుముగా ప్రభుత్వానికి రూ.1,797 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే సోమవారం ఉదయాన్నే ప్రారంభమైన మద్యం దుకాణాల వేలం ప్రక్రియతో ఆయా ప్రాంతాలు సందడిగా మారాయి. ఎన్నికల కేంద్రాలను తలపిస్తున్నాయి. ఉద్రిక్తతలు తలెత్తకుండా లాటరీ కేంద్రాల వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు.
100 మీటర్ల పరిధిలోనే వాహనాల రాకపోకలను నిలిపేస్తున్నారు. కాలినడకతోనే మద్యం లాటరీ కేంద్రాలకు అనుమతిస్తున్నారు. అయితే లాటరీ దక్కిన వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దక్కని వారిలో నిరుత్సాహం కనిపిస్తోంది. కొన్ని చోట్ల లాటరీ దక్కిన వారితో సిండికేట్ అయ్యేందుకు మద్యం షాపుల దరఖాస్తుల దారులు బెరసారాలకు దిగుతున్నారు.