పలాస రైల్వే స్టేషన్ మూడో నెంబరు ప్లాట్‌ఫారంపై ఆదివారం ఉదయం గుర్తుతెలియని యువకుడు(30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కామాఖ్య సూపర్‌ఫాస్ట్ రైలు ప్లాట్‌ఫారంపై గంటపాటు నిలిచిపోయింది. మృతదేహాన్ని తరలిం చిన అనంతరం రైలును యదాతధంగా పంపించారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. సోమవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో కామాఖ్య రైలు పలాస మీ దుగా భువనేశ్వర్ వైపు వెళ్తోంది. ప్లాట్‌ఫారంపై నుంచి గుర్తుతెలియని యువకుడు ఒక్కసారిగా రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్లాట్‌ఫారంపై రైలు వేగాన్ని నియంత్రించి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చూసిన డ్రైవరు రైలును నిలిపివేశాడు. అప్పటికే ఆ యువకుడి శరీరం నుజునుజ్జయింది.
గస్తీలో ఉన్న రైల్వేపోలీసులు ఘ టన స్థలానికి చేరుకొని రైలును వెనక్కు మళ్లించారు. అప్పటికే ఆ యువకుడు మృతి చెందాడు. అంతకు ముందు ఆ యువకుడు ఫలక్‌నుమా రైలులో వచ్చినట్లు పోలీసు లు చెబుతున్నారు. తాను మరణిస్తానని, తనను ఆపకండని తోటి ప్రయాణికులకు చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో అదే రైలుకింద పడి ఆత్మహత్యకు యత్నించి తీవ్ర గాయపడ్డాడు. ఆయన్ను ఆసుపత్రికి తరలించడానికి సిద్ధమవుతున్న తరుణం లో కామాఖ్య రైలుకిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడడం దురదృష్టకరం. హెచ్‌సీ సోమేష్‌కుమార్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడుకి సంబంధించిన వివరాలు లభ్యం కాలేదు. కోల్‌కతా ప్రాంతానికి చెందినవాడిగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌సి తెలిపారు.