ప్రైవేట్ అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలలో ఒకటో తరగతిలో 25 శాతం విద్యార్థులకు రిజర్వేషన్ ఇవ్వాలంటూ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. అమ్మఒడి ఇస్తుండటంతో ఒకటో తరగతిలో 25 శాతం వరకు పిల్లలను చేర్చుకోవాలని 2023-34 సంవత్సరంలో జీవో నెంబర్ 24ను గత ప్రభుత్వం జారీ చేసింది. 2022-23 సంవత్సరంలో ఈ ఆదేశాలపై జారీ చేసిన మెమోను కోర్టులో విద్యా సంస్థలు సవాల్ చేశాయి.
కోర్టులో విచారణ జరుగుతుండగానే 2023-24 సంవత్సరంలో ఒకటో తరగతిలో 25 శాతం మంది పిల్లలను ప్రభుత్వం సూచించిన వారిని చేర్చుకోవాలని జీవో జారీ అయ్యింది. ఈ జోవోను సవాల్ చేయడంతో అప్పట్లో అడ్మిషన్లు అన్నీ తుది తీర్పుకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై ఈరోజు (మంగళవారం) హైకోర్టులో విచారణ జరుగగా... జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 24ను కొట్టివేస్తూ న్యాయస్థానం తుది తీర్పు ఇచ్చింది. ఈ జోవో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా హక్కు చట్టానికి పూర్తి భిన్నంగా ఉందని తీర్పులో పేర్కొంది.