ఓడరేవులు, విమానాశ్రయాలు, లాజిస్టిక్స్ పార్కులు, అంతర్గత జల మార్గాలు, రైల్వేలు, ఫ్రైట్ కారిడార్లు, ఎక్స్‌ప్రె్‌సవేలు మొదలైన రంగాల్లో ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో త్వరగా ఫలితాలు సాధించవచ్చునని చంద్రబాబు పేర్కొన్నారు. సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా ఇంధన రంగంలో అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. తద్వారా చమురు దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరముండదని తెలిపారు.
భవిష్యత్తు అవసరాలకు సంబంధించిన పాఠ్యాంశాలను విద్యార్థులకు అందించాలన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ‘డెమోగ్రఫిక్ మేనేజ్‌మెంట్’ను సిద్ధం చేసుకోవాలని సూచించారు. డేటా అనలిటిక్స్, ఏఐ, రోబోటిక్స్ వాడకంతో రోగ నిర్ధారణ, ఆరోగ్య సేవల ఖర్చును భారీగా తగ్గించవచ్చన్నారు. ప్రజలు మరోసారి మోదీ నాయకత్వంపై విశ్వాసం ఉంచారనేందుకు హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్‌లలోనూ ఎన్డీయే కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నేటి దాకా మోదీ కీ ఓటమే లేదని అన్నారు.