ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ హిందూ ఆచారాలు, ధర్మాన్ని పాటించరని మాజీ కేంద్ర మంత్రి అశోక్ జగపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. "దొంగలు నీతులు చెబుతుంటే వినడానికి మాకు కష్టంగా ఉంది.
జగన్ ఇంట్లో ఒక మతం, బయట మరో మతం. జగన్ హిందూ ఆచారాలు, ధర్మాన్ని పాటించరు. హిందూ ధర్మ రక్షణకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. తిరుమల కల్తీ నెయ్యి అంశంలో ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే." అశోక్ గజపతిరాజు అన్నారు.