గుత్తి పట్టణంలోని అన్న క్యాంటీన్ ను శనివారం మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్న క్యాంటీన్ లో పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు.
ఈ సందర్భంగా క్యాంటీన్ లో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. అధిక వర్షాల దృష్ట్యా వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరికి ఆహారం అందేలా చూడాలని క్యాంటీన్ సిబ్బందికి సూచించారు.