ధర్మవరం పట్టణం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రభుత్వ బాలుర కళాశాలలో ఈ నెల 20వ తేదీన ఆదివారం నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు జయ సింహ తెలిపారు.
ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కంటి వైద్య శిబిరం నిర్వహిస్తామన్నారు. ఉచిత కంటి వైద్య శిబిరం పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.