రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు, విద్యాశాఖ కార్యాలయాల అవసరాల నిమిత్తం ప్రభుత్వం 100 కోట్లు మంజూరు చేయడం పట్ల ఏపీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ శనివారం అనంతపురంలో హర్షం వ్యక్తం చేశారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు. గతములో పాఠశాలలకు నిధులు మంజూరు కాకపోవడం వల్ల విద్యార్థులు చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు.